దానికి నో చెప్పడం వల్లే సినిమా ఆఫర్లు తగ్గాయి.. మృణాల్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
దానికి నో చెప్పడం వల్లే సినిమా ఆఫర్లు తగ్గాయి.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన అందంతో, నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ మూవీస్‌తో తెలిగింటి మహాలక్ష్మీలా మారి అభిమానుల మనసు దోచుకుంది. క్లాసికల్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న మృణాల్‌కు ప్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక స్థానం ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ.. ఒకనొక టైంలో వాళ్ల పేరెంట్స్ కారణంగా అవకాశాలు తగ్గయట. తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న బ్యూటీ.. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది.

ఆమె మాట్లాడుతూ.. ‘మా పేరెంట్స్‌కు ముద్దు సన్నివేశాలు, రొమాంటిక సీన్స్ ఉన్న సినిమాలు నచ్చవు. ఈ కారణంగా అలాంటి సీన్లు ఉన్న ఎన్నో సినిమాలకు నేను నో చెప్పాను. ఎందుకంటే అలాంటి ముద్దు సిన్లలో నన్ను చూస్తే వాళ్లు ఎలా చూస్తారు అని భయం వేసింది. కానీ, ఎంత కాలం అని భయపడాలి. దీంతో పేరెంట్స్‌తో మాట్లాడే సమయం వచ్చింది. ముద్దు సీన్లు కూడా నా వృత్తిలో ఒక భాగమనని చెప్పాను. మీకు అసౌకర్యంగా ఉంటుందని నేను చాలా ఆఫర్లు మిస్ చేసుకున్నారు. కానీ అది నా ఎంపిక కాదు. పాత్రలో ప్రాధాన్యం ఉన్నప్పుడు చేయాలి. అది మీరు అంగీకరించాలి అని మా పేరెంట్స్‌కు చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చింది మృణాల్.



Next Story

Most Viewed