- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయనతార సినిమాపై MLA రాజాసింగ్ సీరియస్.. అమిత్ షాకు సంచలన విజ్ఞప్తి
దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతారా ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా వరుస వివాదాల్లోకి చిక్కకుంటుంది. ఈ చిత్రం శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీరాముడు మాంసాహారి అని, ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అంటూ ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. దీంతో సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నయనతారపై కేసు నమోదైంది. తాజాగా.. ఈ ఇష్యూపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
గతంలో కూడా ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని.. భవిష్యత్‌లో మరెవరూ ఇలాంటి చిత్రాలు తీయకుండా దర్శక నిర్మాతలు, నటీనటులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నాను. అయితే క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ జరుగుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు రావడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్రస్తుతం రాజాసింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించగా.. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.