- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ రోజును లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను : Megastar Chiranjeevi ఎమోషనల్
దిశ, సినిమా : తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని యంగ్ జనరేషన్ హీరోలకు ఆదర్శంగా నిలిచిన నటుడు చిరంజీవి. ఆయన తర్వాత ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నప్పటికీ ఎవరూ కూడా చిరు స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ఇక నేడు(ఆగస్ట్ 22) 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తనకు పుట్టినరోజు కన్నా సెప్టెంబర్ 22 అంటేనే చాలా ప్రత్యేకమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
దీనికి కారణం చిరు మొదటి సినిమా 'పునాది రాళ్లు' అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించిన 'ప్రాణం ఖరీదు' సినిమానే ముందుగా(1978 సెప్టెంబర్ 22) విడుదలై ఘనవిజయం సాధించింది. అందుకే ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని, తాను కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన రోజు అదేనని పేర్కొన్నారు. అందుకే సెప్టెంబర్ 22 అంటే తనకు చాలా ప్రత్యేకమని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
సల్మాన్ ఖాన్‌తో ఎంట్రీ.. అదిరిపోయిన Mega Star Birthday గిఫ్ట్
మా అన్నా, తమ్ముడిని ఏమన్నా అంటే తాటా తీస్తా.. Nagababu వార్నింగ్