సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి.. అనర్హుడిని అంటూ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 9 |   ( Updated:2024-04-13 12:39:36.0  )
సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి.. అనర్హుడిని అంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గురించి సుపరిచితమే. లెక్కలేనన్నీ సినిమాల్లో అద్భుతంగా నటించి.. తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్‌తో పాటు తన ఫ్యామిలీ వారసులను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా నిలబెట్టారు. 68 ఏళ్లలో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీపడుతూ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. ఇకపోతే తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ పలు విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వెళ్లాను. కానీ నాకు పాలిటిక్స్ పనికిరావని అర్థమైంది. నేటీ రాజకీయాల్లో నాలాంటి వాడు అనర్హుడు అన్నది ముమ్మాటికి వాస్తవం. దీంతో వెంటనే వెనక్కి వచ్చేశాను. పాలిటిక్స్‌ను వదిలేశాక.. జనాలకు నాపై అదే ప్రేమ ఉంటుందా? అని అనుమానం ఉండేది. కానీ జనాలు నాపై అదే అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇక బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటాను’’ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed