- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
దయచేసి నా అభిమానులను భయపెట్టకండి.. వారికి మెగాస్టార్ చిరంజీవి సూచన
దిశ, వెబ్‌డెస్క్: గతంలో తాను క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి బయటపెట్టారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి ఓపెనింగ్‌లో పాల్గొన్న చిరంజీవి క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని రివీల్ చేశారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు తాను ఇప్పుడే వ్యాధి బారినపడినట్లు వార్తలు ప్రచురించాయి. ఈ విషయం తెలిసిన చిరు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించాను. ఈ సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్‌గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్‌గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ను డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు/స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని అన్నాను.
అయితే, కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగులు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు.’’ అని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టి ఆవేదన చెందారు.
ఇవి కూడా చదవండి:
నాకు క్యాన్సర్ వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్
Varun Tej - Lavanya Tripati: : స్టార్ డైరెక్టర్‌తో వెడ్డింగ్ వీడియో ప్లాన్ చేసుకున్న