- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మెగాస్టార్ భావోద్వేగం
దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్‌లో వస్తోన్న ‘హనుమాన్’ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని N కన్వెన్సన్ హాల్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నా ఆరాధ్య దైవమైన హనుమంతుడి గురించి మాట్లడే సందర్భంగా నాకు ఇప్పటివరకు రాలేదని.. ఈ చిత్రబృందం వల్ల నాకు ఈ గొప్ప అవకాశం దక్కిందని అన్నారు.
చిన్నప్పటినుంచి ఆంజనేయ స్వామిని తలుచుకోని రోజంటూ ఉండదని భావోద్వేగానికి లోనయ్యారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఆ ఆంజనేయ స్వామినే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయని తాను బలంగా నమ్మతానని చెప్పారు. మతాల ప్రస్తావన తీసుకురాకుండా.. హనుమంతుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, స్వశక్తితో ఎదిగేందుకు కృషిచేయాలని కోరారు.