మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికెట్ వైరల్.. చిరు ఎక్కడ పుట్టాడంటే?

by Anjali |   ( Updated:2024-04-05 09:23:59.0  )
మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికెట్ వైరల్.. చిరు ఎక్కడ పుట్టాడంటే?
X

దిశ, సినిమా: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి సుపరిచితమే. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన.. చిరు తన నటన, డాన్స్ తో టాలీవుడ్ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇన్నేళ్ల చిరంజీవి కష్టానికి ప్రతి ఫలంగా ఇటీవల పద్మ విభూషన్ అవార్డు అందుకున్నారు. ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు సైతం పోటీపడుతూ సినిమాలు చేస్తున్నాడంటే రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు.

ఇకపోతే తాజాగా మెగాస్టార్ చదువుకున్న 10 వ తరగతి నాటి సర్టిఫికెట్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్టిఫకేట్ లో చిరు పేరు కె ఎస్ ఎస్ వరప్రసాద్ రావు అని.. తండ్రి పేరు వెంకట్రావు అని ఉంది. ఈ హీరో పెనుగొండ లో పుట్టినట్లు ఇందులో ఉంది. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. మెగాస్టార్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీ కోసం చిరు ఈ వయస్సు(68)లో కూడా జిమ్ కు వెళ్లి కష్టపడుతుండం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగాస్టార్ డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు.

Read More..

బుల్లితెర నటితో రామ్ పోతినేని పెళ్లి.. అలా లవ్‌లో పడిపోయాడా?

Advertisement

Next Story