- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mega star chiranjeevi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా ఫ్యామిలీ.. ఫొటోస్ వైరల్
దిశ, సినిమా: తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి దర్శించుకున్నారు. ఈ రోజు చిరు బర్త్‌డే కావడంతో.. తల్లి అంజనాదేవి, భార్య సురేఖ ఇతర కుటుంబసభ్యులతో కలిసి బుధవారం మెగాస్టార్ తిరుమలకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. ఇక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మెగాస్టార్ చిరంజీవికి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో చిరంజీవిని సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ మూవీతో బిజీగా ఉన్నాడు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్ శర వేగంగా జరుగుతున్న ఈ చిత్రం నుంచి నేడు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో మెగాస్టార్ ఓ ఎత్తైన కొండపై మోకాళ్లపై కూర్చుని, చేతిలో త్రిశూలం చేత పట్టుకుని కనిపిస్తున్నాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.