మరోసారి గ్లామర్ డోస్ పెంచేసిన నిహారిక.. ఈ తెగింపు ఎందుకని?

by Anjali |   ( Updated:2023-06-22 11:58:11.0  )
మరోసారి గ్లామర్ డోస్ పెంచేసిన నిహారిక.. ఈ తెగింపు ఎందుకని?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక ఈ మధ్య వరుస ఫొటో షూట్లతో అదరగొడుతోంది. భర్తతో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటన రానప్పటికీ పరోక్షంగా హింట్ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి సారిస్తుంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని బాగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ట్రెండీ లుక్‌లో, మెస్సీ హెయిర్, టైట్ టాప్‌లో హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిహారిక హైదరాబాద్‌లో కొత్తగా ఓ ఆఫీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. నిహారిక నటించిన లేటెస్ట్ ‘డెడ్ ఫిక్సెల్’ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వుతుంది. ఈ జనరేషన్ యూత్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ తెరకెక్కింది. ఊహాజనిత ప్రపంచంలో బ్రతికే గేమర్స్ గురించి చూపించడం జరిగింది. అందులో అల్ట్రా మోడ్రన్ గర్ల్‌గా నిహారిక ప్రేక్షకులను మెప్పించింది.


.Also Read..

Sunny Leone : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సన్నీ లియోన్..

Advertisement

Next Story