Vishwak Sen: మెకానిక్ రాఖీ ఫస్ట్ సింగిల్.. మాస్ అభిమానులకు పండగే

by Prasanna |
Vishwak Sen: మెకానిక్ రాఖీ ఫస్ట్ సింగిల్.. మాస్ అభిమానులకు పండగే
X

దిశ, సినిమా : తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో విశ్వక్ సేన్ చాలా డిఫరెంట్.. కెరియర్ మొదటి నుంచి మాస్ యాంగిల్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ సినిమాలు చేసేవాడు ఈ మధ్యనే కొత్త పాత్రలు ఎంచుకుని సాహసాలు చేస్తున్నాడు. వీటిలో కొన్ని బోల్తా కొట్టిన ప్రేక్షకులకు మాత్రం తన మీద ఉన్న ఒపీనియన్ ని అయితే మార్చేశాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ , మీనాక్షి చౌదరీ, శ్రద్దా శ్రీనాథ్ పాత్రలో నటిస్తున్న సినిమా మెకానిక్ రాఖీ.

ముళ్లపూడి రవితేజ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా, సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే’.. అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకాభిమానులు ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సుద్ధాల అశోక్‌తేజ లిరిక్స్ రాశారు. సింగర్ మంగ్లీ చాలా అందంగా పాడింది. పూర్తి మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ ఎన్ని మార్కులు వేపించుకుంటాడో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed