81ఏళ్ల వయసులో స్విమ్ సూట్.. మోస్ట్ ఓల్డెస్ట్ ఉమన్‌గా నిలిచిన మార్తా

by Anjali |   ( Updated:2023-05-16 12:21:15.0  )
81ఏళ్ల వయసులో స్విమ్ సూట్.. మోస్ట్ ఓల్డెస్ట్ ఉమన్‌గా నిలిచిన మార్తా
X

దిశ, సినిమా: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మార్తా స్టీవర్ట్.. అరుదైన అవకాశం దక్కించుకుంది. 81ఏళ్ల వయసులో స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన తమ వార్షిక సంచిక కవర్‌ పేజీకోసం స్విమ్‌ సూట్ ధరించి ఫోజులిచ్చిన అత్యంత ఓల్డెస్ట్ ఉమన్‌గా నిలిచింది. కాగా ఈ అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తం చేసిన స్టీవర్ట్.. ‘ఆ షూట్‌ కోసం సిద్ధం కావడానికి సుమారు మూడు నెలల సమయం పట్టింది.

ఈ అనుభవం నాకెంతో ఆత్మవిశ్వాసం ఇచ్చింది. కొత్తగా ప్రయత్నించడం, నిర్భయంగా ఉండటం చాలా మంచిది. దేనికీ భయపడకూడదు. నేను వయస్సు గురించి పెద్దగా ఆలోచించను. కానీ, ఇది ఒక రకమైన చరిత్రను క్రియేట్ చేయడమే అని అనుకుంటున్నా’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక 1980లలో వంటలకు సంబంధించి పలు పుస్తకాలు రాసి కీర్తి పొందిన స్టీవర్ట్.. ప్రస్తుతం లాస్ వెగాస్‌లో స్వంత రెస్టారెంట్‌ నడుపుతూనే పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


Advertisement

Next Story