- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి.. నటి కరాటే కళ్యాణికి మంచు విష్ణు నోటీస్
దిశ, డైనమిక్ బ్యూరో: సీనియర్ ఎన్టీఆర్‌పై నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆమెకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా నోటీసులు పంపించారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఖమ్మం లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉండటంపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విగ్రహ రూపంపై ఓ మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీనియర్ ఎన్టీఆర్ ఏమైనా నిజమైన కృష్ణుడా? కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సహించబోమని చెప్పారు ఆమె వ్యాఖ్యలు సంచలనం కావడంతో దీనిపై వివరణ కోరుతూ మంచు విష్ణు తాజాగా నోటీసులు జారీ చేశారు. నోటీసులపై కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read more: