చరణ్‌కు అర్థరాత్రి ఫోన్ చేసి రూ. 5లక్షలు అడిగితే అలా చేశాడంటూ.. మంచు మనోజ్ వైరల్ కామెంట్స్

by Dishafeatures1 |
చరణ్‌కు అర్థరాత్రి ఫోన్ చేసి రూ. 5లక్షలు అడిగితే అలా చేశాడంటూ.. మంచు మనోజ్ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా చరణ్‌కి సోషల్ మీడియా ద్యారా బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఫ్యాన్స్ కూడా ఎప్పటి లాగే ఈ సారి కూడా ఎంతో గ్రాండ్‌గా హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా రామ్ చరణ్ గొప్పతనం గురించి హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.. ‘రామ్ చరణ్ నా ప్రాణ మిత్రుడు.. అలాంటి నా స్నేహితుడి బర్త్ డే ఈవెంట్ కు ఇలా రావడం ఆనందంగా ఉంది.చరణ్ చిన్నతనం నుంచి నాతో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఈ కాలంలో అలాంటి స్నేహం దొరకడం చాలా కష్టం.. అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారు.. పాత వారిని మర్చిపోతారు. కానీ చరణ్ అలా కాదు.స్నేహితులతో ఎప్పటికీ ఒకేలా ఉంటాడు.

ఇక కష్టాల్లో ఉన్నవారికి చరణ్ సాయం చేయడానికి ఎప్పుడు ముందుంటాడు. ఇలాగే ఒక సారి ఓ కుటుంబం దుబాయ్ లో చిక్కుతుంది. ఆడబిడ్డ కష్టాల్లో ఉందని తెలిసి నా వంతు సహాయం చేశాను. కానీ ఇంకా డబ్బులు కావాల్సి వచ్చింది. అర్ధరాత్రి ఫోన్ చేసి రామ్ చరణ్ 5 లక్షలు అడిగాను. ఆడబిడ్డకు కష్టం ఉందని చెప్పిన వెంటనే ఐదు లక్షలు పంపించాడు. అది చరణ్ గొప్పతనం’ అని తెలిపారు మనోజ్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.


Next Story

Most Viewed