- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు హరీష్ రావు కుడి భుజం
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హరీష్ రావు కుడిభుజం లాంటోడని ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు ప్రతిసారి భారీ మెజారిటీతో గెలుపొందే నేత అని అన్నారు. హరీష్ రావు మీద ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుందని తెలిపారు. ఆయన రాజీనామా సవాల్‌ను ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. నిజంగా రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే తన రాజీనామా పత్రాన్ని ప్రజల ఎదుట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని అన్నారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు.. ఒక్కసారి కూడా మాట మీద నిలబడలేదని ఎద్దేవా చేశారు.
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి రేవంత్ వెళ్లేప్పుడు శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని గుర్తుచేశారు. హరీష్ రావు రాజీనామాపై మాట్లాడే ముందు రేవంత్ తన గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు అనుభవజ్ఞుడైన నాయకుడు.. ఆయన నుంచి రేవంత్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పారు. హరీష్ రావు సిద్దిపేట ఆత్మ అని అన్నారు. రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్ధాల పునాదుల మీద మొదలైందని అన్నారు. హరీష్ రావు సవాల్‌ను రేవంత్ స్వీకరించలేకపోతున్నారని సెటైర్ వేశారు. హామీల అమలులో రేవంత్ పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. నాలుగు నెలల్లోనే రేవంత్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని అన్నారు.