చరణ్ బర్త్ డే పార్టీలో చిరు-మోహన్ బాబు గొడవల గురించి కుండబద్దలు కొట్టిన హీరో!

by Disha Web Desk 9 |
చరణ్ బర్త్ డే పార్టీలో చిరు-మోహన్ బాబు గొడవల గురించి కుండబద్దలు కొట్టిన హీరో!
X

దిశ, సినిమా: ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ గురించి సుపరిచితమే. నిన్న ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపించారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీస్, బిగ్ బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు అతిథిగా హాజరైన హీరో మంచు మనోజ్ ఫుల్ జోష్ లో కనిపిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి వాళ్ల ఇల్లు, మా ఇళ్లు అన్ని పక్క పక్కనే ఉండేవి. అందరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. చరణ్ చిన్ననాటి ఫ్రెండ్స్‌ను ఇప్పటికి మర్చిపోలేదు. ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం వెంటనే ఆదుకుంటాడు. దుబాయ్ ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంది అర్జెంట్ గా 5 లక్షలు కావాలని అడిగా.. వెంటనే అకౌంట్ నెంబర్ పంపమని మనీ సెండ్ చేశాడు’ అంటూ మనోజ్ చెప్పుకొస్తాడు.

అనంతరం చిరంజీవి-మోహన్ బాబు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. చరణ్ నీవు ఎందుకు అంత క్లోజ్ గా ఉంటారు ఎందుకు? అని అడగ్గా.. వెంటనే మనోజ్.. ‘భర్తాభర్తలు తరచూ గొడవ పడుతుంటారు. మళ్లీ వెంటనే కలిసి పోతుంటారు. ఈ విషయం గురించి బయట వాళ్లు మాట్లాడకూడదు. వారిద్దరు టామ్ అండ్ జెర్రీ అంటూ వెల్లడించాడు. చివర్లో మెగా -మంచు ఫ్యామిలీ మధ్య రిలేషన్ ఫిష్ అండ్ వాటర్ లా ఉండాలి. ఫిష్ అండ్ ఫిషర్ లా కాదంటూ ఓ డైలాగ్ చెబుతాడు.


Next Story

Most Viewed