మేక పాలల్లో అద్భుత ఔషధ గుణాలు.. తాగారంటే దెబ్బకు రోగాలన్నీ మాయం!

by Dishafeatures2 |
మేక పాలల్లో అద్భుత ఔషధ గుణాలు.. తాగారంటే దెబ్బకు రోగాలన్నీ మాయం!
X

దిశ, ఫీచర్స్ : ఆవు, బర్రె, మేక వంటి జంతువుల పాలు మనం తరచుగా వినియోగిస్తుంటాం. సహజంగానే పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రత్యేక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నందువల్ల మేకపాలు పలు అనారోగ్యాలను దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

* మేకపాలల్లో మిగతా జంతువుల పాలతో పోల్చితే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీంతో పాటు ట్రైటోఫాన్ అనే ఎమినో యాసిడ్స్ కలిగి ఉండటంవల్ల శరీరంపై గాయాలను, పుండ్లను, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా డెంగ్యూ, ప్రేగు వంటి వ్యాధులవల్ల వచ్చే శారీరక లక్షణాలు, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మూడ్ డిజార్డర్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి రుగ్మతలతో బాధపడే వారు అప్పుడప్పుడూ మేకపాలను తాగితే ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇవి శరీరంలో హార్మెన్ల ఇంబ్యాలెన్స్‌ను నివారించడంతోపాటు యాంటీ డిప్రెసివ్ హార్మోన్ల విడుదలలో సహాయపడతాయి. మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి.

*రక్తహీనత, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు మేకపాలను తాగడంవల్ల క్రమంగా ఉపశమనం పొందుతారు. ఎందుకంటే మేకపాలల్లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్రరక్త కణాలు, రోగ నిరోధకశక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. కాల్షియం అధికస్థాయిలో ఉన్నందువల్ల ఎముకల బలహీనత, మెడ నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.



Next Story

Most Viewed