కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించండి : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Disha Web Desk 11 |
కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించండి  : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ, రాజేంద్రనగర్ : బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు గెలిపించుకుని బీసీల దమ్ము ఏంటో చూపిద్దామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. మైలార్దేవరపల్లి డివిజన్ దుర్గా కన్వెన్షన్ లో బడుగు బలహీన వర్గాల సమ్మేళనం నిర్వహించిన ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ... రెండు రోజులు బాగా కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. కాసాని జ్ఞానేశ్వర్ బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు వివరించారు. ఒక పది నెలలు సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed