Manchu Manoj : అంబానీ వేడుకలో మంచు మనోజ్.. (ఫొటోస్ వైరల్)

by sudharani |   ( Updated:2023-11-02 17:41:09.0  )
Manchu Manoj  : అంబానీ వేడుకలో మంచు మనోజ్.. (ఫొటోస్ వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: భూమా నాగ మౌనికతో పెళ్లి తర్వాత మంచు మనోజ్ మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. సినిమాల్లో నటిస్తూనే.. ఓ టీవీ షోను చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా అంబానీ వేడుకలో సతీసమేతంగా పాల్గొని మరోసారి అందరి దృష్టిని తనవైపు మళ్లించుకున్నాడు మనోజ్.

రిలయన్స్, జియో అధినేత ముఖేష్ అంబానీ.. ముంబైలో అత్యంత లగ్జరీ మాస్ ‘జీయో పవరల్డ్ ప్లాజా’ ను బుధవారం ప్రారంభించారు. ఇది లగ్జరీ షాపింగ్ మాల్. సెలబ్రిటీలకు అడ్డా అయినా బాంద్రాలో దీన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే.. చాలా మంది హీరోయిన్లు హాజరయ్యి సందడి చేసినప్పటికీ హీరోలకు మాత్రం పెద్దగా ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్‌కు ఈ ఈవెంట్‌కు ఆహ్వానం అందడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ వేడుకలలో మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి సందడి చేశారు. ఈ దంపతులు ముఖేష్ అంబానీతో కలిసి కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story