Malvika Nair: మనసుకు నచ్చితేనే అలాంటి సినిమాలు చేస్తా.. కెరీర్ అనుభవాలపై నటి

by Prasanna |   ( Updated:2023-03-14 08:07:37.0  )
Malvika Nair: మనసుకు నచ్చితేనే అలాంటి సినిమాలు చేస్తా.. కెరీర్ అనుభవాలపై నటి
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ మాళవిక నాయర్ తన మనసుకు నచ్చిన సినిమాలే చేస్తానంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మార్చి 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న బ్యూటీ ఈ మూవీతోపాటు తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే సాధారణ ప్రేమ కథలకంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. నేను పోషించిన అనుపమ పాత్ర నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంది. అలాగే అవకాశం వచ్చిన ప్రతి సినిమా చేయాలనుకోవట్లేదు. మనసుకు నచ్చిన కథలు మాత్రమే అంగీకరిస్తా. తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు అంతర్జాతీయ గుర్తింపు రావడం సతోషంగా ఉంది. చివరగా నా కళ్లు బాగున్నాయని దర్శకుడు బాబీ చెప్పడం నాకెంతో ఆనందాన్నిచ్చింది’ అంటూ వివరించింది.

Read more:

అనసూయ బోల్డ్ ఫోటో షూట్.. Only 18+ | Anasuya Bharadwaj enjoying in Ukiyo Beach Resort

Advertisement

Next Story