Malvika Nair: నా ఫస్ట్ క్రష్ విజయ్ కాదు.. మరొకరున్నారంటున్న మాళవికా

by Prasanna |
Malvika Nair: నా ఫస్ట్ క్రష్ విజయ్ కాదు.. మరొకరున్నారంటున్న మాళవికా
X

దిశ, సినిమా : మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా నాయర్‌ తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసింది. ఆమె నటించిన మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌‌లో పాల్గొంటున్న నటి తన పర్సనల్ లైఫ్ అండ్ కెరీర్ గురించి మాట్లాడింది. ‘నిజానికి నేను పైలెట్ కావాలని కలలు కనేదాన్ని. కానీ, సినిమాల వల్ల నా డ్రీమ్ పక్కన పెట్టేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నపుడు స్నేహితులంతా విజయ్ దేవరకొండ గురించి అడిగేవారు. ఆయనకు నాకు మధ్య ఏదో ఉందని ఏడిపించేవారు. కానీ, నేను ఎల్‌కేజీలోనే ఒకబ్బాయిని ఇష్టపడ్డాను. అదే నా ఫస్ట్‌ క్రష్‌. క్లాస్‌మేట్స్‌ అందరం కలిసి తీసుకున్న గ్రూప్‌ ఫొటోలో అతన్ని చూస్తూ మురిసిపోయేదాన్ని. ఆరో తరగతి తర్వాత నేను వేరే స్కూల్‌కు మారడంతో ఆ కథ ముగిసిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయంలో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయే పాత్ర చిన్నదైనా సరే చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story