కరీనా కపూర్‌కు అహంకారం ఎక్కువే.. ఎవరినీ లెక్కచేయదు

by Prasanna |   ( Updated:2023-05-08 09:05:35.0  )
కరీనా కపూర్‌కు అహంకారం ఎక్కువే.. ఎవరినీ లెక్కచేయదు
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి కరీనా కపూర్ బిహేవియర్‌పై మరాఠీ నటుడు, నిర్మాత మహేష్ తిలేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో తనకు ఎదురైన ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఒకసారి విమానాశ్రయంలో కలిసినపుడు పలకరించినా పట్టించుకోనట్లే వెళ్లిపోయిందని అసహనం వ్యక్తం చేశాడు. అలాగే సహనటి రాధికా ఆప్టేతో సెల్ఫీ దిగకపోగా ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చేందుకు ఇష్టపడలేదని మండిపడ్డాడు. ‘ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. లండన్ నుంచి ఇండియాకు వస్తున్నప్పుడు విమానంలో కరీన వద్దకు వెళ్లి పలకరించాడు. అయితే తనతో ఇంటరాక్ట్ కావాలనుకునే వాళ్లందరినీ తిరస్కరించింది. అభిమానులతోపాటు ఆయనను అగౌరవపరిచింది. ఆ సంఘటన మూర్తిని చాలా కలచివేసిందని అర్థమైంది. ఇంత అహంకారం వల్ల ఆమెకు ప్రయోజనం ఏమిటి?’ అంటూ మహేష్ పలు ప్రశ్నలు సంధించాడు.

Also Read..

బోల్డ్‌గా రెచ్చిపోయి ఆ పార్ట్స్ చూపించేసిన కీర్తి సురేష్.. ఫొటో వైరల్

Advertisement

Next Story