భర్త రవీంద్రకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మీ

by Prasanna |   ( Updated:2023-07-10 07:59:42.0  )
భర్త రవీంద్రకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మీ
X

దిశ, సినిమా: కోలీవుడ్‌ బుల్లితెర నటి మహాలక్ష్మీ, నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్‌లకు పెళ్లి జరిగి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికి ఈ జంటకు సంబంధించి ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ వీరిద్దరిపై వచ్చే ట్రోలింగ్ మాములుగా ఉండవు. ముఖ్యంగా ఆస్తి, డబ్బు కోసమే ఆమె రవీందర్‌ను వివాహం చేసుకుందంటూ చాలా విమర్శలు వస్తున్నాయి. కానీ. ఆ మాటలన్నీటికి సమాధానం వారి ఇద్దరి మధ్య ఉన్న అన్యోనత అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరు చాలా ప్రేమగా ఉంటారు. తాజాగా రవీందర్ పుట్టిన రోజు సందర్భంగా తన భర్తకు మర్చిపోలేని బహుమతి ఇచ్చింద మహాలక్ష్మీ. 6 అడుగులు ఎత్తున్న రవీంద్ర ఫొటోను చక్కటి పెయింటింగ్‌తో తీర్చిదిద్ది గిఫ్ట్‌గా ఇచ్చింది. ‘లైఫ్‌లో నాకు మళ్లీ ధైర్యం నూరిపోసిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరే నా బలం. నేను ఎప్పటికీ నీకు కృతజ్ఞురాలినే. లవ్ యూ ఫర్‌ ఎవర్‌’ అంటూ భర్తపై ప్రేమను కురిపించింది. ఇది చూసిన నెటిజన్లు ‘లవ్లీ కపుల్‌’, ‘అన్యోన్య దాంపత్య బంధం’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story