14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-07-31 12:28:32.0  )
14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మాటల మాంత్రికుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మగధీర’. 2009లో వచ్చిన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లోనే బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగా రాసి.. రికార్డులు బద్దలు కొట్టింది. ఆ సినిమా వచ్చి 14 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మేరకు ‘‘మరచిపోలేని సినీ రత్నం 14 బ్లాక్‌బస్టర్ సంవత్సరాలను జరుపుకుంటున్నా ‘మగధీర’. అసాధారణమైన మేకింగ్, కథనాలు, ఆకర్షణీయమైన ప్రదర్శనలు దక్షిణ భారత బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయాయి’ అంటూ ట్వీట్ షేర్ చేశారు.

Advertisement

Next Story