‘ఉస్తాద్’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లోకేషన్స్

by Dishaweb |   ( Updated:2023-10-10 15:44:50.0  )
‘ఉస్తాద్’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లోకేషన్స్
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కల్యాణ్ రామ్ ‘బలగం’ మూవీతో హీరోయిన్‌గా మెప్పించింది. మొదటి చిత్రం తోనే భారీ విజయం దక్కించుకున్న ఆమె.. మరోసారి చిత్రం ‘ఉస్తాద్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింహా కోడూరి హీరోగా, ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘చుక్కల్లోంచి తొంగిచూసే చక్కానైనా జాబిల్లీ’ అంటూ సాగే ఈ పాటలో హీరోతో కలిసి హీరోయిన్ ట్రావెల్ చేస్తూ అందమైన బ్యాగ్రౌండ్‌తో సాంగ్ అకట్టుకుంటుంది. ఇక అకీవా స్వరపరిచిన ఈ పాటకు రెహ్మాన్ సాహిత్యం అందించగా కార్తీక్ ఆలపించాడు.

Read More: కిస్ సీన్లకు నో బ్రేక్స్: వైష్ణవిపై నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్

Advertisement

Next Story