పెళ్లి కాకుండానే తల్లైన వరలక్ష్మీ శరత్ కుమార్.. కూతురితో ఆడుతున్న వీడియో వైరల్

by Dishafeatures1 |
పెళ్లి కాకుండానే తల్లైన వరలక్ష్మీ శరత్ కుమార్.. కూతురితో ఆడుతున్న వీడియో వైరల్
X

దిశ,సినిమా:నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా వచ్చిన హనుమాన్ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఆమె ఒక పాపతో ఆడుతూ డాన్స్ చేస్తున్నది. అది చూసి నెటిజన్లు పెళ్లి కాకుండనే తల్లి అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ వీడియో ఆమె అనిల్ కాట్జ్ దర్శకత్వం వహిస్తున్న 'శబరి' మూవీలోనిది. ఈ చిత్రాన్ని మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. కాగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతుంది.

అయితే తాజాగా ఈ మూవీలోని నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా…

మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా…

ఓ కొత్త లోకం చేరి తుళ్లి తుళ్లి ఆడుకుందాం ఎంతసేపైనా..

అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ పాటకి రెహమాన్ క్యాచీ లిరిక్స్ అందించారు. ఈ పాటను అమృత సురేష్ పాడాగా 'శబరి మ్యూజిక్' ఛానల్ ద్వారా సాంగ్ విడుదలైంది. ఈ పాటను వరలక్ష్మీ శరత్ కుమార్, సినిమాలో ఆమె కుమార్తె గా నటించిన నివేక్ష మీద తెరకెక్కించారు.

ఈ సాంగ్ విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తల్లిగా ఆమె నటించిన తీరు, కుమార్తె కోసం పడే తపన, తల్లీ కూతుళ్ళ మధ్య సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆమె తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. అయితే ఈ సినిమాను మే 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.



Next Story