చిరంజీవితో నటిస్తానంటున్న లావణ్య త్రిపాఠి.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

by samatah |   ( Updated:2023-06-18 06:11:20.0  )
చిరంజీవితో నటిస్తానంటున్న లావణ్య త్రిపాఠి.. ఫైర్ అవుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక వరుణ్‌తేజ్‌ను ప్రేమించి, ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే మూడు ముళ్ల బంధంతో లావణ్య, మెగా కోడలిగా మారనుంది. ఈక్రమంలో ఈ అమ్మడుకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈక్రమంలోనే లావణ్య త్రిపాఠి గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

లావణ్య త్రిపాఠి నిఖిల్ సరసన నటించిన, అర్జున్ సురవరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ మీకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నిఖిల్ తో సినిమా అవకాశం వస్తే మీరు ఏ హీరోతో నటిస్తారు అని అడగ్గా, ఆమె నేను చిరంజీవితో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ కాగా, నెటిజన్స్.. కాబోయే మామతో ఎలా నటిస్తావంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: అప్పుడే ఆస్తులన్నీ అమ్మేశాను నా ఆరోగ్యంపై పుకార్లు సృష్టించొద్దు.. కమెడియన్ సుధాకర్ కామెంట్స్..

Advertisement

Next Story