- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దానికోసమే ఎదురుచూస్తున్నా.. త్వరలో ఆ గుడ్‌న్యూస్ చెప్పనున్న లావణ్య త్రిపాఠి
దిశ, సినిమా: ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సొట్టబుగ్గల భామ లావణ్య త్రిపాఠి. ‘‘ఉన్నది ఒక్కటే జిందగీ, మిస్టర్, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, దూసుకెళ్తా, అర్జున గాంఢీవధారి’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. మిస్టర్ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించి.. ఈ హీరోతో ప్రేమలో పడింది. గత ఏడాది జూన్ లో ఎంగేజ్‌మెంట్ చేసుకుని మెగా అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చారు. ఇక నవంబరులో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.
లావణ్య త్రిపాఠి పెళ్లయ్యాక మొదటిసారి.. ‘‘మిస్ పర్‌ఫెక్ట్’’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి భర్త వరుణ్ తేజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మిస్టర్, అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు కదా? మరీ పెళ్లయ్యాక మీరిద్దరు మళ్లీ కలిసి నటిస్తారా? అని ప్రశ్నించగా.. లావణ్య బదులిస్తూ.. ‘మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా నటిస్తాను. కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇక ఆ సమయం కోసం ఎదురు చూడాల్సిందే’ అని లావణ్య వెల్లడించింది.
అలాగే సినిమాల గురించి మాట్లాడుతూ.. ఓటీటీ, సినిమాలు అనే భేదాలు నాకు లేవు. కథ నచ్చితే ఏ సినిమాలోనైనా నటిస్తాను. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. నా ఫ్యామిలీ కూడా నన్ను రిస్ట్రిక్ట్ చేయదు. అలాంటి ఇలాంటి పాత్రల్లో నటించొద్దని ఎవ్వరు కండిషన్స్ పెట్టరు. ఎలాంటి సినిమాల్లో నటించాలో నాకు బాగా తెలుసు. అలాగే మెగా కోడలి ట్యాగ్‌ను బాధ్యతగా భావిస్తున్నాను. ఆ పిలుపు నాకు చాలా ప్రత్యేకం. కండిషన్స్ విషయానికొస్తే.. అలాంటి, ఇలాంటి పాత్రలు చేయొద్దని నాకు ఎలాంటి కండిషన్స్ లేవు’’. అంటూ లావణ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లావణ్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.