టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్.. అసలు కారణం ఏమిటంటే?

by Jakkula Samataha |
టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్.. అసలు కారణం ఏమిటంటే?
X

దిశ, సినిమా : ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీని దర్శకుడు బుచ్చిబాబు పరిచయం చేశారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమాలో ఈ నటి హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ముద్దుగుమ్మ, ఆమె అందంతో అందరినీ ఆకట్టుకొని, ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. దీంతో బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఇక తర్వాత వరసగా ఆఫర్స్ క్యూ కట్టడంతో ఈ ముద్దుగుమ్మ రేంజ్‌నే మారిపోయింది. నాని సినిమాలో శ్యామ్ సింగరాయ్, మూవీతో మరో హిట్ అందుకుంది. తర్వాత విడుదలనై బంగార్రాజు కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇకే ఇది ఈ బ్యూటీకి చివరి హిట్. తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. దీంతో కృతికి టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ కీలక నిర్ణయం తీసుకున్నదంట. అది ఏమిటంటే? శర్వానంద్ కృతి జంటగా నటించిన మనమే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ, టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనుందంట. ఆమెకు తమిళంలో భారీగా ఆఫర్స్ వస్తున్నట్లు , ఇప్పటికే మూడు సినిమాలతో ముద్దుగుమ్మ చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎండ్ కార్డు వేయనున్నదంట.

Advertisement

Next Story

Most Viewed