KRK బాలీవుడ్ వాళ్లంతా పరిగెత్తి ప్రచారం చేసినా.. ఆ చెత్త సినిమాలను ఎవ్వరూ చూడరు

by Hamsa |   ( Updated:2023-07-25 07:43:56.0  )
KRK బాలీవుడ్ వాళ్లంతా పరిగెత్తి ప్రచారం చేసినా.. ఆ చెత్త సినిమాలను ఎవ్వరూ చూడరు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సినీ క్రిటిక్ కేఆర్కే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు సినిమాలపై కాంట్రవర్సీ రివ్యూలు ఇస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవల షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాపై పలు విమర్శలు చేసి తీవ్ర దుమారం రేపాయి.

తాజాగా, కేఆర్కే బాలీవుడ్ చిత్రాలను ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశాడు. ‘‘ బాలీవుడ్ నటులు తమ సినిమాలకు ప్రమోట్ చేసుకోవడానికి పరుగెత్తుతుంటారు. కానీ, బాలీవుడ్ నటులు పరిగెత్తినట్లుగా ఇంగ్లీష్ సినిమా నటులు భారత్‌లో తమ చిత్రాలను ప్రమోట్ చేయడం లేదు. హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఏ జర్నలిస్టుకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. కానీ, ఇప్పటికీ హాలీవుడ్ సినిమాలు ఇండియాలో బ్లాక్ బస్టర్ బిజినెస్ చేస్తున్నాయి. ఎందుకు? బాలీవుడ్ ఇండస్ట్రీ తనను తానే నాశనం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రతి చిత్రం చెత్తగా ఉంటోందని ప్రజలు బాలీవుడ్ చిత్రాలను చూడటానికి ఆసక్తి చూపరు. ఈ విధ్వంసానికి కార్పొరేట్ సంస్థలు పూర్తిగా బాధ్యత వహిస్తాయని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వారు సినిమా కాకుండా ప్రాజెక్ట్‌లను మాత్రమే చేస్తున్నారు’ అంటూ రాసుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి-Koratala Shiva‘Devara’లో ఆ వీరుడి పోరాటం చూస్తే గూస్ బంప్సే.. కొరటాల అసలే తగ్గట్లేదట!

Advertisement

Next Story