ఆమె నాన్సెన్స్ యాటిడ్యూడ్ నాకు నచ్చింది.. కొంకణా సేన్

by Anjali |   ( Updated:2023-04-11 08:31:03.0  )
ఆమె నాన్సెన్స్ యాటిడ్యూడ్ నాకు నచ్చింది.. కొంకణా సేన్
X

దిశ, సినిమా: జయా బచ్చన్ కఠినమైన వైఖరిని చాలా ఇష్టపడతానంటోంది కొంకణా సేన్ శర్మ. తాను అతిగా ప్రేమించే, ఆరాధించే నటి కూడా ఆమె అంటూ జయ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘జయా బచ్చన్ నాన్సెన్స్ యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టం. ఫొటోగ్రాఫర్లను తిట్టడంలో ఆమెనే ఫాలో అవుతా. ఎందుకంటే ఆమె ముక్కుసూటిగా వ్యవహరిస్తుంది. కానీ మనం అనుకున్నంత కఠినాత్మురాలు మాత్రం కాదు. తనతో మాట్లాడాలనుకునే సామాన్యులకు కూడా అవకాశం ఇస్తుంది. ఆమెతో ఏ విషయమైనా సులభంగా షేర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఆమె ఒక రత్నం లాంటిది. ఎల్లప్పుడూ దయ, గౌరవంతో సరదాగా ఉంటుంది. ‘లాగ చునారి మే దాగ్’ షూటింగ్ టైమ్‌లో నాకు జబ్బు చేస్తే ఒక తల్లిలా ప్రేమను పంచింది’ అంటూ ప్రశంసలు కురిపించింది.


Advertisement

Next Story