ఆసుపత్రిలో చేరిన కోలివుడ్ స్టార్ హీరో అజిత్.. ఆందోళనలో ఫ్యాన్స్!

by Jakkula Samataha |
ఆసుపత్రిలో చేరిన కోలివుడ్ స్టార్ హీరో అజిత్.. ఆందోళనలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఒక్కసారిగా టాలీవు, కోలీవుడ్‌లో అజిత్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అసలు మన హీరోకి ఏమైంది? ఎందుకు ఆసుపత్రిలో చేరారు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై అజిత్ సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఆయన తన తర్వాత సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో మెడికల్ ఫార్మా లిటికోసం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్స్ అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలడంతో రెండు, మూడు రోజుల పాటు అబ్జర్‌వేషన్‌లో ఉన్నాడని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు.అంతే కాకుండా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed