తిరుమలపై ముద్దు వివాదం.. డైరెక్టర్, హీరోయిన్‌‌కు బిగ్ షాక్

by Rajesh |
తిరుమలపై ముద్దు వివాదం.. డైరెక్టర్, హీరోయిన్‌‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల కొండపై డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ కు ముద్దు పెట్టడం దూమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని సనాతనధర్మ పరిరక్షణసమితి తాజాగా డిమాండ్ చేసింది. డైరెక్టర్ ఓమ్ రౌత్, కృతిసనన్ పై ఎస్వీయూ క్యాంపస్ పీఎస్ లో కంప్లైంట్ చేసింది. తిరుమలలో హీరోయిన్ కృతిసనన్ ను డైరెక్టర్ ఓంరౌత్ ముద్దుపెట్టుకున్నారు. ఆలింగనం చేసుకున్న తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.

ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదేం పని అని భక్తులు ఫైర్ అవుతున్నారు. డైరెక్టర్ తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తిరుమలలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని సినిమా బృందం దర్శించుకుంది. ఆ సమయంలో ఓం రౌత్, హీరోయిన్ కు ముద్దుపెట్టడంతో వివాదం మొదలైంది.

Also Read... ఆదిపురుష్ డైరెక్టర్ కృతి సనన్ ముద్దుల వ్యవహారం.. చిలుకూరు బాలాజీ అర్చకుడు ఫైర్

Next Story

Most Viewed