కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ' ట్విట్టర్ రివ్యూ

by GSrikanth |
కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ ట్విట్టర్ రివ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. ఈ సినిమా మహా శివరాత్రి పర్వదినాన విడుదల అయింది. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో ఆరంగేంట్రం చేసిన కిరణ్, ఆ తరువాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చెప్పుకునే రేంజ్‌లో మంచి సినిమా పడలేదు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందు వచ్చాడు.

'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించగా, అతని శిష్యుడు బన్నీవాస్ నిర్మాత. క‌శ్మీరా ప‌ర్ధేశీ హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ వేదికగా పంచుకున్న అభిప్రాయం ప్రకారం.

పాజిటివ్స్: మేకింగ్ క్వాలిటీ, సాంగ్స్, బీజీఎం, కిరణ్ నటన, కామెడీ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్

నెగెటివ్: నిధానంగా సాగే ప్రథమార్ధం, ముందే ఊహించగలిగే కొన్ని ట్విస్టు

Advertisement

Next Story

Most Viewed