- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kiran Abbavaram: ఎందుకు పనికిరావు.. వరెస్ట్ అని ఎగతాళి చేశారు?
దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్ ఒడిదొడుకుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన నటించిన ‘మీటర్’ సినిమా ఏప్రిల్ 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న హీరో తాజాగా వరంగల్ నిట్‌లో ఏప్రిల్ 7నుంచి ‘స్ర్పింగ్ స్ర్వీ’ వేడుకలు మొదలవ్వనుండగా ముందస్తుగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై సందడి చేశాడు. ఈ మేరకు ‘నేను రాయలసీమ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశా. బెంగళూర్, చెన్నైలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాబ్ కూడా చేశా. కానీ, ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో సినిమా రంగంలోకి వచ్చేశా. అయితే ఈ విషయం ఫ్యామీలీలో ఎవరితో చెప్పలేదు. ‘రాజావారు రాణివారు’ సినిమా తర్వాతే ఇంట్లో వాళ్లకు తెలిసింది. అందరూ నన్ను వరెస్ట్ స్టూడెంట్ అనేవారు. కానీ, ‘వరెస్ట్ ఈజ్ ది బెస్ట్’ అని నిరూపించాను. ఒక దశలో ఎందుకు పనికిరాను అన్నవారినే స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాను. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. నెగెటీవ్ మాటలు పట్టించుకోకుండా కష్టపడి మన సత్తా ఏంటో నిరూపించాలి’ అంటూ విద్యార్థులను ప్రోత్సహించాడు.
ఇవి కూడా చదవండి: Bollywood: నేను ఏ అమ్మాయితో సహజీవనం చేయలేదు: బాలీవుడ్ హీరో