సిద్ధార్థ్‌ని పెళ్లాడకపోయుంటే అంబానీకి కోడలయ్యేదాన్ని : Kiara Advani

by sudharani |   ( Updated:2023-06-24 06:06:33.0  )
సిద్ధార్థ్‌ని పెళ్లాడకపోయుంటే అంబానీకి కోడలయ్యేదాన్ని : Kiara Advani
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ‌లోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీయారా అద్వానీ. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా ప్రజెంట్ వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కీయార తమ మధ్య ఏమీ లేదంటూ చెప్తూనే అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని ఊహించని షాక్‌ ఇచ్చారు. అయితే కియారా సిద్దార్థ్‌ని పెళ్లి చేసుకోకపోయుంటే గనుక అంబానీకి కోడలయ్యి ఉండేదట.

ఎందుకంటే కియారా అద్వానీ తండ్రి జగదీశ్ అద్వానీ కూడా పెద్ద వ్యాపారవేత్తయేగాక చిన్నప్పటి నుంచి ముఖేశ్ అంబానీకి క్లోజ్ ఫ్రెండ్ కూడా. అంతేగాక కియారా, అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ‌తో కలిసి చదువుకునేదట. దీంతో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారినప్పటికీ.. మోడల్ అవ్వాలనేది కియారాకు కల. కానీ ఆకాష్ అంబానీకి అది ఇష్టం లేకపోవడం, కియారా అద్వానీ ఎంత చెప్పినా ఒప్పుకోకపోవడంతో తన కెరీర్‌కు మాత్రమే ప్రయారిటీ ఇచ్చి, అతనికి బ్రేకప్ చెప్పేసిందట.

Click here for more Cinema news

Next Story