keeravani: ‘పద్మ శ్రీ’ అవార్డు అందుకున్న కీరవాణి.. గర్వంగా ఉందన్న రాజమౌళి

by Prasanna |   ( Updated:2023-04-08 05:41:18.0  )
keeravani: ‘పద్మ శ్రీ’ అవార్డు అందుకున్న కీరవాణి..  గర్వంగా ఉందన్న రాజమౌళి
X

దిశ, సినిమా: గణతంత్ర దినోత్సవ వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన ‘పద్మ శ్రీ’ అవార్డుల 2023 ప్రదానోత్సవం (రెండో సెషన్) సందడిగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా.. మార్చి 22న తొలి విడతలో 50 మందికి పైగా ఇచ్చేశారు. అయితే తాజాగా మిగిలిన వారందరికీ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసిన రాజమౌళి ‘నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్‌గా ఉంది పెద్దన్న’ అంటూ ట్వీట్ చేశాడు.

తండ్రి కాబోతున్న రానా.. మిహీకా బేబి బంప్‌ వీడియో వైరల్

రేపు నా పుట్టినరోజు గిఫ్ట్స్ ఇవ్వండి కానీ ఎవరూ విష్ చేయొద్దు..

Advertisement

Next Story