oscars 2023-Naatu Naatu: ఆస్కార్ అవార్డ్ అందుకుంటున్న వేళ కీరవాణి ఎమోషనల్

by Javid Pasha |   ( Updated:2023-03-13 05:27:08.0  )
oscars 2023-Naatu Naatu: ఆస్కార్ అవార్డ్ అందుకుంటున్న వేళ కీరవాణి ఎమోషనల్
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్కార్ వేదికపై తెలుగు సాంగ్ ‘నాటు నాటు’ దుమ్ములేపింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరీలో ఆస్కార్ అవార్డును కొల్లగొట్టి 140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేసింది. ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కాగా అవార్డ్ అందుకున్న వేళ నాటు నాటు స్వరకర్త కీరవాణి ఎమోషనల్ అయ్యారు. ఆస్కార్ ను చేతబట్టుకున్న ఆయన.. ఇంగ్లీష్ లో పాట పాడుతూ పరవశించిపోయారు. ఆర్ఆర్ఆర్ మూవీ డైరెక్టర్ రాజమౌళి, ఆయన కుమారుడు కార్తీకేయ, తన కుటుంబ సభ్యుల సహకారాన్ని పాట ద్వారా చెబుతూ ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి : RRR.. వందకోట్ల హృదయాలను గర్వపడేలా చేసింది: చిరంజీవి

Advertisement

Next Story