పిల్లల కోసం నా భర్తతో 14 సార్లు ప్రయత్నించా.. కానీ సల్మాన్ ఖాన్ వల్ల తల్లినయ్యా : Kashmera Shah

by Prasanna |   ( Updated:2023-07-12 12:38:59.0  )
పిల్లల కోసం నా భర్తతో 14 సార్లు ప్రయత్నించా.. కానీ సల్మాన్ ఖాన్ వల్ల తల్లినయ్యా :  Kashmera Shah
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కాశ్మీరా షా గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే కాశ్మీరా 2013లో టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్‌‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి మ్యారేజ్ అయి ఇప్పటికీ పదేళ్లు గడుస్తుండగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ‘మాకు పెళ్లయిన తర్వాత పిల్లల కోసం ఎంతో ఆరాటపడ్డాం. నేను ప్రెగ్నెంట్ కావడానికి నా భర్తతో 14 సార్లు ట్రై చేశా. ఎంతో మంది వైద్యులను సంప్రదించి, ఎన్నో ఆసుపత్రులు తిరిగి, చివరికి ఐవీఎఫ్ కూడా ట్రై చేశా. కానీ ఫలితం లేదు. దీంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్నప్పుడు మీరెందుకు సరోగసి ద్వారా పిల్లల్ని కనకూడదని సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడు. ఇక వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన సలహాతో పెళ్లైన నాలుగేళ్ల తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులం అయ్యాం. సల్మాన్ వల్లే ఇదంతా జరిగింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ విషయంలో ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాశ్మీరా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More: అర్ధరాత్రి ఫామ్ హౌస్‌లో ప్రత్యేక పూజలు చేస్తున్న Allu Arjun.. కారణం అదేనా?

Advertisement
Next Story

Most Viewed