భారీ ధరకు అమ్ముడుపోయిన Karthikeya ‘Bedurulanka 2012’ థియేట్రికల్ రైట్స్

by Prasanna |   ( Updated:2023-07-30 10:55:43.0  )
భారీ ధరకు అమ్ముడుపోయిన Karthikeya ‘Bedurulanka 2012’ థియేట్రికల్ రైట్స్
X

దిశ, సినిమా: ‘RX100’ మూవీతో భారీ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ అనే మరో కొత్త కథతో రాబోతున్నాడు. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా వెన్నెల కిషోర్, సత్య, గోపరాజు రమణ కీలక పాత్ర పోషించారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్‌లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. మొత్తానికి ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా తాజా సమాచార ప్రకారం విడుదలకు నాలుగు వారాల ముందుగానే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.5 కోట్లకు విక్రయించాయి. ఇక సీడెడ్ ఏరియా హక్కులను శ్రీ ధనుష్ ఫిలింస్ సొంతం చేసుకోగా నైజాం, ఆంధ్రా హక్కులను శంకర్ పిక్చర్స్ కొనుగోలు చేసింది.

Also Read: 'Miss Shetty Mr Polishetty' సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే

Advertisement

Next Story