kareena kapoor: అందుకు నాకు గర్వంగా ఉంది.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-07-20 11:44:30.0  )
kareena kapoor: అందుకు నాకు గర్వంగా ఉంది.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండున్న నటీమణుల్లో ఈమె ఒకరు. ఈ భామ 2000 లో అభిషేక్ బచ్చన్‌ సరసన రెఫ్యూజీలో మొట్టమొదటిసారిగా నటించి తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత అగ్ర హీరోల పక్కన అవకాశాలు కొట్టేసి నేడు స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది.అయితే కరీనాకు మొదట్లో హీరోయిన్ అవ్వాలనే ఆలోచనే లేకపోయేదట. ఆమె న్యాయవాది కావాలనే ఓ పట్టు ఉండేదట. కరీనా నిజానికి చదువులో మంచి ఇంటెలిజెంట్ గర్ల్ అట. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కరీనా కపూర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను చాలా బాగా చదివేదాన్ని. మంచి విద్యార్థిని. నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు.లాయర్‌ని అవుతానని అనుకున్నాను.” అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే తను హార్వర్డ్‌లో చేసిన సమ్మర్ కోర్సు గురించి చెప్పుకొచ్చింది. ‘నేను హార్వర్డ్‌లోని సమ్మర్ స్కూలుకు వెళ్లినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆ క్యాంపస్‌లో నేడు ఒక ఫోటోను కూడా పొందాను. నేను న్యాయవాదిని అవుతానని అనుకున్నాను. కానీ ఊహించని విధంగా ఈ నటన ఫీల్డ్ లోకి రావాల్సి వచ్చింది. నన్ను ఈ రూట్ ఎంచుకోమని ఎవరు బలవంతం చేయలేదు. నేను ఏం చేయాలనుకున్నా నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తారు’ అంటూ కరీనా కపూర్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed