- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే.. TDP, బాలయ్యకు కాపునాడు అల్టీమేటం!
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహాం బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ.. అక్కినేని తొక్కినేని, ఎస్వీ రంగారావును ఆ రంగారావు.. ఈ రంగారావు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. బాలయ్య కామెంట్స్‌పై ఇప్పటికే అక్కినేని యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ స్పందించగా.. తాజాగా ఈ అంశంపై కాపునాడు స్పందించింది. నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కాపునాడు టీడీపీ, బాలయ్యకు అల్టిమేటం జారీ చేసింది.
ఎస్వీ రంగారావును ఉద్దేశించి ఆ రంగారావు, ఈ రంగారావు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాపునాడు తప్పుబట్టింది. ఎస్వీ రంగారావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈనెల 25 లోపు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా కాపునాడు డిమాండ్ చేసింది. ఇక ప్రముఖ టాలీవుడ్ హీరోలపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సీనియర్ హీరోల పట్ల బాలయ్య చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పలువురు నటీనటులు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి : బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగ చైతన్య, అఖిల్ స్ట్రాంగ్ కౌంటర్