కేవలం ఒక్క రూపాయికే సినిమా టికెట్..

by Prasanna |   ( Updated:2023-05-30 08:58:06.0  )
కేవలం ఒక్క రూపాయికే సినిమా టికెట్..
X

దిశ, సినిమా: OTT ప్లాట్ ఫామ్స్ వచ్చినప్పటి నుంచి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. దీని కోసం టికెట్ ధరల హెచ్చుతగ్గులు చేస్తున్నప్పటికీ.. జనాలు మాత్రం థియేటర్‌లో స్టార్ హీరోల చిత్రాలు, 3D మూవీస్ మాత్రమే చూస్తున్నారు. దీంతో తాజాగా టికెట్ ధర రూ.1 మాత్రమేనని ప్రకటించింది ‘యదా యదా హి’ మూవీ యూనిట్. అశోక తేజ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం.. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగుతుండగా శుక్రవారం గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమా ప్రీమియర్ షో కేవలం ఒక్క రూపాయితో చూడొచ్చని పిలుపునిస్తున్నారు మేకర్స్. మే 31వ తేదీ బుధవారం సాయంత్రం జరగనున్న ఈ ప్రీమియర్ షో బెంగుళూరులోని వీరేష్ సినిమాస్, హుబ్బళ్లిలోని సుధా సినిమాస్‌లో చూసేందుకు ఛాన్స్ ఇచ్చారు.

Also Read....

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉరితాడుతో హల్ చల్ చేసిన మోడల్

Advertisement

Next Story