- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'దుర్గాదేవి ప్రతి రూపాలే మహిళలు'... దీపికకు మద్దతుగా కన్నడ నటి, లోక్‌సభ మాజీ ఎంపీ రమ్య !
దిశ, సినిమా: బాలివుడ్ కింగ్ షారుఖ్‌ఖాన్, దీపికా పదుకొనె నటించిన 'పఠాన్' మూవీలోని ఓ పాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ పాటలో దీపిక అసభ్యంగా నటించారని, ఆమె వస్త్రధారణ బాగ లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు దీపికకు అండగా నిలుస్తున్నారు. బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఇప్పటికే తన మద్దతు ప్రకటించింది. తాజాగా కన్నడ నటి, లోక్‌సభ మాజీ ఎంపీ రమ్య కూడా ఈ జాబితాలోకి చేరింది. ఆమె మాట్లాడుతూ..''విడాకులు తీసుకుందనే కారణంగా సమంతను ట్రోల్ చేశారు. అభిప్రాయాన్ని చెప్పినందుకు సాయిపల్లవిని, నటుడి నుంచి విడిపోయినందుకు రష్మికను ట్రోల్ చేశారు. ఇప్పుడు పొట్టి దుస్తులు ధరించిందంటూ దీపికా పదుకొనెపై కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మహిళలపై ఏదో ఒక కారణంగా విమర్శలు చేస్తున్నారు. ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది. అది ప్రాథమిక హక్కు. దుర్గాదేవి ప్రతి రూపాలే మహిళలు. స్త్రీ ద్వేషం అనే రాక్షసుడితో పోరాటం చేయాల్సిన అవసరం నేటి మహిళలకు ఎంతైనా ఉంది'' అని రమ్య తన ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేసింది.
READ MORE
మహిళలు ధైర్యంగా డిమాండ్ చేయడం నేర్చుకోవాలి: రెమ్యూనరేషన్పై Mrunal Thakur