సొంతంగా ఇల్లు కొన్న కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్.. ఎన్ని కోట్లో తెలుసా?

by GSrikanth |
సొంతంగా ఇల్లు కొన్న కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్.. ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ, సినిమా: లోకనాయకుడు కమల్ హాసన్ వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆయన ఇద్దరు కూతుర్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్. ఇందులో పెద్ద కూతురు శ్రుతి తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. నటిగానే కాకుండా గాయనిగానూ మెప్పిస్తూ.. ప్రజంట్ తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. త్వరలో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. ఇక కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ గురించి చాలా మందికి తెలియదు.

ఆమె తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ శ్రుతి మాదిరిగా గుర్తింపు మాత్రం దక్కలేదు. అయితే తాజాగా అక్షరకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. ఆమె ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిందని తెలుస్తుంది. దీని విలువ దాదాపు రూ. 5.75 కోట్లు కాగా.. 2,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 15 అంతస్తుల టవర్‌లోని 13వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ పలు ప్రత్యేకతలతో ఉందని సమాచారం.

Advertisement

Next Story