కమల్ ఒకేసారి ఆరుగురిని ప్రేమించాడు: కుట్టి పద్మిని

by Vinod kumar |
కమల్ ఒకేసారి ఆరుగురిని ప్రేమించాడు: కుట్టి పద్మిని
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటీమణి కుట్టి పద్మిని కమల్ హాసన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్రీవిద్య, రేఖ, జయసుధ, వాణి గణపతితో పాటు మరో ఇద్దరు నటీమణులను ఒకేసారి లవ్ చేశాడని చెప్పింది. అయితే వాణి గణపతి కమల్ హాసన్‌ను పెళ్లి చేసుకోగా.. ఈ పెళ్లి విషయం శ్రీదేవి, శ్రీవిద్యను ఆశ్చర్యపరిచిందట. శ్రీవిద్య మాత్రం కమల్ హాసన్‌ను చాలా ఇష్టపడిందట. కమల్ పెళ్లి తర్వాత ఆమె చాలా రోజులుగా ఒత్తిడికి గురైందని, కొన్నాళ్ల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు పద్మిని తెలిపింది. ‘ఆమె కొన్ని రోజులకే విడాకులు తీసుకుని పూర్తిగా సినిమాలు వదిలేసి సొంతూరులో స్థిరపడింది. అలా కొద్ది రోజులకు శ్రీవిద్యా క్యాన్సర్ బారిన పడగా తన ఆస్తినంతా ఓ ట్రస్టుకు రాసిచ్చి 2006లో మరణించింది’ అని కుట్టి గుర్తు చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed