‘కల్కి’ బ్లాక్ బస్టర్ హిట్.. ప్రభాస్‌ను మళ్లీ ఏమైనా అంటే చంపేస్తామంటూ వేణు స్వామికి ఫ్యాన్స్ వార్నింగ్!

by Hamsa |
‘కల్కి’ బ్లాక్ బస్టర్ హిట్.. ప్రభాస్‌ను మళ్లీ ఏమైనా అంటే చంపేస్తామంటూ వేణు స్వామికి ఫ్యాన్స్ వార్నింగ్!
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పి సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా వేణు స్వామి సమంత, నాగచైతన్య పెళ్లికి ముందే విడాకులు తీసుకుంటారని చెప్పాడు. అయితే వారు నిజంగానే డైవర్స్ తీసుకోవడంతో ఒక్కసారిగా వేణు స్వామి జాతకాలను సెలబ్రిటీలంతా నమ్మడం మొదలెట్టారు. కొందరు ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. అయితే వేణు స్వామి ప్రభాస్ సినిమాలపై కూడా కామెంట్స్ చేసి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఇటీవల విడుదలైన సలార్ ఫ్లాప్ అవుతుందని చెప్పాడు. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.

అయినప్పటికీ ఇవన్నీ పట్టించుకోకుండా వేణు స్వామి ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి కూడా డిజాస్టర్ అవుతుందని రిలీజ్‌కు ముందే చెప్పాడు. అంతేకాకుండా ప్రభాస్ సినిమాలు మానేయడం మంచిది ఎంత ప్రయత్నించినా బాహుబలి అంత సక్సెస్ సాధించడం కష్టం అన్ని డిజాస్టర్ అవుతాయని అన్నాడు. అయితే కల్కి జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగా రాబడుతోంది. ఈ క్రమంలో.. వేణు స్వామిని ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకోసారి ప్రభాస్ జాతకం అలా ఉంది సినిమాలు చేయకపోవడం మంచిది అని నోటికి వచ్చింది వాగావో చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా నోటికి వచ్చిన బూతులన్నీ వాడేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో పలు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

Next Story

Most Viewed