తప్పతాగి డ్రైవింగ్ చెయ్యడంతో.. స్టార్ సింగర్ అరెస్ట్!

by sudharani |
తప్పతాగి డ్రైవింగ్ చెయ్యడంతో.. స్టార్ సింగర్ అరెస్ట్!
X

దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ సింగర్, గ్రామీ అవార్డ్ విజేత జస్టిన్ టింబర్ లేక్ అరెస్ట్ అయ్యాడు. తప్పతాగి మద్యం మత్తులో డ్రైవింగ్ చెయ్యడంతో న్యూయార్క్ ఐలాండ్‌లోని సాగ్ హార్బర్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా.. 2002లో సోలో రికార్డింగ్ సింగర్‌గా కెరీర్ స్టార్ చేసిన టింబర్ లేక్.. తన టాలెంట్‌తో గ్రామీ అవార్డ్ విన్నర్‌గా నిలిచాడు.


ప్రస్తుతం ‘ఫర్గెట్ టుమారో’ పేరుతో గ్లోబల్ టూర్‌లో ఉన్నాడు. మార్చిలో స్టార్ట్ అయిన కొత్త ఆల్బమ్ ‘ఎవ్రీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. వచ్చే వారంలో చికాగో, న్యూయార్క్‌లోని కొన్ని ఈవెంట్స్ చెయ్యనున్నాడు. అంతే కాకండా ఆ తర్వాత యూరప్‌లో ఈ నెలాఖరులో కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ ఈలోపే టింబర్ అరెస్ట్ కావడంతో ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్.

Next Story