- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు Jr. NTR దూరం.. కారణం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఖైత్లాపూర్‌లో ఇవాళ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు చారిత్ర్మాకంగా నిలిచిపోయేలా నిర్వహించాలని ఎన్టీఆర్ శతజయంతి కమిటీ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ఇందులో భాగంగా నందమూరి, నారా ఫ్యామిలీలను సైతం ఆహ్వానించింది. అయితే, ఈ ఉత్సవాలు మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతాయనగా స్టార్ హీరో జూ ఎన్టీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కాలేనని జూనియర్ ఉత్సవాల నిర్వహణ కమిటీకి తెలిపారు. ఎన్టీఆర్ పీఆర్ టీమ్ ఈ విషయం కమిటీకి స్పష్టం చేసింది.
‘‘మే 20వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. ఆయన ఈ రోజు తన 40వ జన్మదినోత్స కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు. ఈ రోజు కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం కోసం ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు’’ అని జూనియర్ ఎన్టీఆర్ సిబ్బంది తెలిపింది.
అయితే, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ హాజరుకాకపోవడం అటు సినీ, ఇటు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్‌కు, నారా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొద్ది రోజులుగా వస్తోన్న వార్తలకు ఎన్టీఆర్ తాజా నిర్ణయం మరింత బలం చేకూర్చినట్లైందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక, ఎన్టీఆర్ ఉత్సవ కమిటీ ఈ కార్యక్రమానికి చంద్రబాబు, బాలకృష్ణ, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, కన్నడ హీరో శివ రాజ్ కుమార్, జయప్రద, అశ్వినీదత్‌తో సహ పలువరు ప్రముఖులను ఆహ్వానించారు.
Read more:
సింహాద్రి సినిమా రీ రిలీజ్.. థియోటర్లో రమా రాజమౌళి హంగామా..! (వీడియో)