క్రేజీ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ.. నందమూరి ఖాతాలో మరో హిట్ ఖాయమా..?

by Nagaya |   ( Updated:2024-02-02 12:19:25.0  )
క్రేజీ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ.. నందమూరి ఖాతాలో మరో హిట్ ఖాయమా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయనకు RRR మంచి బూస్ట్‌ను ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’లో బిజీగా ఉన్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయనుంది. సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, రమ్యకృష్ణ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ లాంటి అగ్రతారలు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవరను రెండు భాగాలు నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇంత బిజీలోనూ ఎన్టీఆర్ మరో రెండు చిత్రాలకు సైన్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్.

దిగ్గజ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ చిత్రాలకు సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రశాంత్ నీల్ చిత్రానికి బ్రేకులు పడినా.. లోకేష్ కనకరాజ్ చిత్రం పట్టాలెక్కబోతున్నదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. విక్రమ్, లియో చిత్రాల ఘన విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న లోకేష్ కనకరాజ్‌.. ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో అగ్ర హీరోగా ఉన్న ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌లోనూ దూసుకుపోతాడని నందమూరి ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు.

Advertisement

Next Story