‘ది కేరళ & ది కశ్మీర్’.. ప్రజలను కలవరపెట్టాయి: జాస్మిన్

by Prasanna |   ( Updated:2023-05-23 10:10:36.0  )
‘ది కేరళ & ది కశ్మీర్’.. ప్రజలను కలవరపెట్టాయి: జాస్మిన్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ జాస్మిన్ భాసిన్.. ఇటీవల వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. స్థానిక కథాంశాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు తనతోపాటు ప్రజలను కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ‘చేదు నిజం ఆధారంగా తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాలు చాలా డిస్టర్బ్‌‌గా ఉన్నాయి. మంచి కథనంతో వచ్చిన ఈ రెండు చిత్రాలను ప్రేక్షకులు చూడటానికి చాలా ఇష్టపడ్డారు. ఇలాంటి స్టోరీలు జనాలకు బాగా నచ్చుతాయి కూడా. అయితే ఇలాంటి కాంట్రవర్సీలతో కూడిన మూవీస్ చూసినపుడు ఎవరూ ప్రభావితం కాకుడదని కోరుకుంటున్నా. అలాగే వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఎందుకంటే ఈ రెండు చిత్రాలు భిన్నాభిప్రాయాలు కలిగిన మన దేశ ప్రజల మధ్య వివాదాలు సృష్టించడం నాకు నచ్చలేదు’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Read more: దేనికైనా ఒక హద్దు ఉండాలి.. అభిమానులైతే ఎక్కడపడితే అక్కడే తాకుతారా

దేనికైనా ఒక హద్దు ఉండాలి.. అభిమానులైతే ఎక్కడపడితే అక్కడే తాకుతారా

Advertisement

Next Story

Most Viewed